పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం సీతంపాలెం సముద్ర తీరానికి ఓ అనాథ శవం కొట్టుకొచ్చింది. అయితే, ఆ శవం పూర్తిగా కుళ్లిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో దాన్ని తీసుకుపోవడానికి సిబ్బంది వెనుకంజ వేసింది. సాయం చేసేందుకు స్థానికులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాంబిల్లి పోలీసులు వెంటనే స్పందించారు. అనాథ శవాన్ని భుజాన వేసుకుని సుమారు 3 కిలో మీటర్ల వరకు నడిచారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.